Posts

గణతంత్ర దినోత్సవం

 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳  నాట్యమాడె నింగి కెగసి జాతి కేతనం సాధుశాంత సస్యమిళిత మేటి త్రివర్ణం వేద యోగ ఐతిహాస శాస్త్ర సువర్ణం శాంత శ్రామ విద్య విపణ  కీర్తి కిరీటం గణిత జీవ అంతరిక్ష జ్ఞాన శోభితం క్రీస్తుపూర్వ జ్వలిత చరిత ధీర ప్రాక్తనం బోధిసత్వ సత్వ బోధ వికసిత శమనం మిత్ర బంధు పారివార సాదర దేశం విహగ నావ సైన్య త్రిదళ రక్షిత క్షేత్రం అమరవాణి నుగ్గడించు శాంతికపోతం వైరి దేశ పీచ మణుచు శౌర కేసరం ఉగ్రవాణి తరిమిదునుము ఉక్కుమదగజం విపణ సీమ ధాటి మేటి  కౌశలరత్నం రోదసీన నిరుపమాన సుచరిత క్షేత్రం నమస్కృతుల కృతులివియే ఓ! నవ్య భారతం  🙏🙏🙏🙏🙏🙏🙏🙏